టెలివిజన్ అందాల భామల్లో అనసూయ ఒకరు. వయసు పెరుగుతున్నా కొద్దీ తరగని అందంతో ఆకట్టుకుంటోంది అనసూయ.
ఈ అమ్మడి అందం గురించి.. ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే తాజాగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో సినీనటి అనసూయ కెమెరాకు చిక్కింది.
ఓ షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన అనసూయ.. శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది.
శ్రీకాళహస్తి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది అనసూయ.
దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కొత్త సంవత్సరం 2023 లో పోస్ట్ చేస్తున్న మొదటి ఫొటోలు ఇవేనంటూ రాసుకొచ్చింది.