జబర్ధస్త్ యాంకర్‌గా పాపులర్ అయిన అనసూయ.. అందులో వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.
అలా కెరీర్ ఆరంభం నుంచి ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. గుర్తింపు మాత్రం భారీగా వచ్చింది.
ముఖ్యంగా ‘క్షణం', ‘రంగస్థలం'లో ఆమె చేసిన పాత్రలకు మంచి మార్కులే పడ్డాయి.
జబర్ధస్త్ కామెడీ షోకు వచ్చిన తర్వాత అనసూయ ఆస్తుల చిట్టా కూడా అంత కంతకు పెరిగిపోయిందనే టాక్ వినబడుతోంది.
అంతేకాదు గత రెండేళ్లలో ఈమె ఆస్తులు దాదాపు రెట్టింపు అయినట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సుమ తర్వాత సంపాదన విషయంలో టాప్‌లో ఉంది అనసూయ.
అనసూయకు జూబ్లిహిల్స్‌లో దాదాపు రూ. 8 కోట్లు విలువ చేసే ఇల్లు.. కూడా ఉన్నట్టు సమాచారం.
మరోవైపు రెండు కార్లు.. దాదాపు వీటి విలువ రూ. 2.50 కోట్ల వరకు ఉంటుందట.
మార్కెట్ విలువ ప్రకారం ఈమె ఆస్తి రూ. 45 కోట్ల వరకు ఉన్నట్టు సమాచారం.
ఎంత లేదన్న అనసూయ ప్రతి ఇయర్ రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు సంపాదిస్తోంది.