టాలీవుడ్ కు కొత్త అందాలు వెల్లువలా వస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ నుంచి చాలా మంది భామలు మనదగ్గర సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.

ఇక ఇప్పుడు మరో ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను మరికొద్దిరోజుల్లో పలకరించనుంది ఆ అమ్మడు ఎవరో కాదు వయ్యారి భామ అనన్య పాండే

బాలీవుడ్ భామ అనన్య త్వరలోనే లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనన్య హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి.

ఇప్పటికే పలు నగరాల్లో పర్యటించిన లైగర్ టీమ్ ఇటీవల హైదరాబాద్ లో కూడా సందడి చేశారు. ఈ సందర్భముగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో హీరోయిన్ అనన్య మాట్లాడుతూ..

తనకు టాలీవుడ్ లో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.

బన్నీ అంటే చాలా ఇష్టమని ఆయనతో కలిసి నటించడానికి ఆతృతగా ఉన్నానని తెలిపింది అనన్య. ఇక తెలుగు ప్రేక్షకుల లవ్ చాలా బాగుంది అని..