వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ
రాధికా మర్చంట్ అనంత్ అంబానీ కి కొంతకాలం క్రితం నిశ్చితార్థం కూడా జరిగినప్పటి నుంచి జంటగానే కనిపిస్తూన్నారు.
వీరి పెళ్లికి సంబంధించిన వార్తలతో పాటు వారు ధరించిన దుస్తులు, ఆభరణాలు వార్తల్లో ప్రధానాంశాలుగా నిలుస్తున్నాయి.
అనంత్, రాధిక ఇటీవల NMACC లో జంటగా కనిపించారు. అక్కడ అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం అనంత్ అంబానీ చేతికి ఉన్న వాచ్
ఈ లగ్జరీ చేతి గడియారం విలువ తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ వాచ్ ధర రూ. 18 కోట్లు.
అనంత్ కోసమే ఈ వాచ్‌ను ప్రత్యేకంగా తయారు చేయించినట్లు తెలుస్తోంది.
పాటెక్ ఫిలిప్ (Patek Philippe) కంపెనీ తయారు చేసిన ఈ వాచ్‌కు ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి.
ఈ వాచ్‌కు సంబంధించిన సాంకేతికత అభివృద్ధి, ఉత్పత్తి, అసెంబ్లీ తదితర ప్రక్రియలకు అన్నింటికీ కలిపి 1,00,000 గంటలు పట్టిందని వెల్లడించారు.