నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ సినిమా నుంచి బుధవారం మరో కొత్త అప్‌డేట్ వచ్చింది

కళ్యాణ్ రామ్  త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ కథానాయకి నటించింది

ఇప్పటికే ఈ సినిమా  నుంచి రెండు పాటలు, టీజర్ కూడా విడుదల అయ్యాయి

ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది

ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్రబృందం ఈ మూవీ ప్రమోషన్స్‌ మొదలుపెట్టింది

ఇదిలా ఉంటె ఫిబ్రవరి 3న ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల చేయనున్నట్లు నందమూరి కళ్యాణ్ రామ్ బుధవారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు

ఈ మేరకు సినిమా నుంచి మాస్ లుక్‌లో ఉన్న తన పోస్టర్‌ని కూడా కళ్యాణ్ రామ్ షేర్ చేశారు

పోనీ టెయిల్‌తో సిగరెట్ తాగుతూ మాస్ లుక్‌లో కళ్యాణ్ రామ్ ఈ పోస్టర్‌లో కనిపించరు