‘బింబిసార’ లాంటి బ్లాక్ బూస్టర్ తరవాత కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి దర్శకత్వలో వస్తున్న చిత్రం ‘అమిగోస్’
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ఆషికా రంగనాధ్ నటిస్తుంది
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే
ఇటీవలే ఈ మూవీ మూడు రోల్స్ లుక్స్ విడుదల చేయడం జరిగింది
మొదటి పాత్రలో వ్యాపారవేత్త సిద్ధార్థ్‌గా, రెండో పాత్రలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మంజునాథ్‌గా, గుబురు గడ్డం, పొడవాటి జుత్తుతో చేతిలో గన్‌తో మూడో పాత్రలో కనిపించారు
ఈ సినిమా ఫిబ్రవరి 10న విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ ప్రొమోషన్స్ లో బిజీగా గడుపుతుంది
ఇందులో భాగంగా టీజర్ విడుదల తేదీని ప్రకటించారు మూవీ మేకర్స్
ఈ నెల 8న ఉదయం 11:07గంటలకు టీజర్ విడుదల కానున్నట్లు చిత్ర బృందం తెలిపింది