‘బింబిసార’ లాంటి విజయం తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్
రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం
‘డోప్ల్ గ్యాంగర్’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చిన ఈ చిత్రంపై డివైడ్ టాక్ తో బాక్సాఫీసు బోల్తా కొట్టింది
ఇదిలా ఉంటే ఇప్పుడు చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది
ఈ చిత్రం విడుదలైన నెల రోజులకే ఓటీటీలో విడుదల కానుందని తెలుస్తోంది
డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ అమిగోస్ స్ట్రీమింగ్ రైట్స్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే
కాగా ఈ చిత్రం మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోందట
అయితే నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వనుందని సమాచారం