ఒమేగా 3 ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్న బఠాణీలను తీసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.
సన్నగా నాజుగ్గా కనపడాలనుకునే వారు బఠాణీలను ఎక్కువగా తీసుకుంటే మంచిది.
మలబద్దకంతో బాధపడేవారు పచ్చి బఠానీలను ఆకుకూరలు, కూరగాయలతో కలిపి తీసుకుంటే విరేచనం సాఫీగా జరిగి మలబద్దకం నుండి విముక్తి పొందవచ్చు.
బఠాణీల్లోని అధికమొత్తంలో ఉన్న ఫైటో న్యూట్రియెంట్స్... పొట్ట క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి.
ఫైబర్ అధికంగా ఉన్న బఠాణీలు తీసుకోవడం వల్ల రక్తసరఫరా సరిగ్గా జరుగుతుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఉంటుంది.
బీ1, బీ2, బీ3, బీ6 విటమిన్స్ కలిగిన బఠాణీలు తీసుకోవడం వల్ల గుండెసమస్యల ముప్పు నుంచీ తప్పించుకోవచ్చు.