అల్లం ఆరోగ్యానికి చాలా మంచిదని ఎప్పట్నుంచో చెబుతున్నారు. అల్లంని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.
అల్లంతోనే టీ చేసుకుని తాగడం వల్ల 8 అద్భుత ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
అజీర్తితో బాధపడేవాళ్లు రెగ్యులర్‌గా ఈ టీ తీసుకోవడంతో సమస్య బాధించదు.
అల్లం టీని రెగ్యులర్‌గా తీసుకోవడంతో రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది.
బాడీలో ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
అధికబరువుని తగ్గించి, చెడుకొలెస్ట్రాల్‌ని దూరం చేసి, గుండె సమస్యలు రాకుండా చూస్తుంది.
మహిళలకు పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా ఆ సమయంలో వచ్చే నొప్పిని అరికడుతుంది.
చాలామంది కీళ్ల నొప్పులు, ఇతర నొప్పులతో బాధపడుతుంటారు. అలాంటివారికి ఈ టీ ఉపశమనం కలిగిస్తుంది.
ఈ టీని తాగడం వల్ల ఒత్తిడి దూరమవ్వడమే కాక తలనొప్పిని తగ్గిస్తుంది.
అల్లంలోని యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలవల్ల అలర్జీలూ ఆస్తమా కూడా తగ్గుముఖం పడతాయి.