నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందని కొందరు, మొటిమలు వస్తాయని ఇంకొందరు చెప్పడం ఎక్కువగా వింటూనే ఉంటాం. 

కాని పౌష్టికాహార నిపుణులు మాత్రం నెయ్యి ఎంతో మేలు చేస్తుందంటున్నారు.

నెయ్యితో శరీరంలో కొవ్వుల స్థాయి పెరిగిపోయి, మనకు హాని చేస్తుందన్న అపోహ చాలా మందిలో ఉంటుంది.

నిజానికి నెయ్యితో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు.

 అన్నంలో నెయ్యి కలుపుకుని తినడం వల్ల కార్బోహైడ్రేట్స్ వెంటనే రక్తంలో కలవకుండా నిదానంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. దానివల్ల బ్లడ్ గ్లూకోజ్ ఒక్కసారిగా పెరిగిపోదు.

 నెయ్యి మన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. చర్మం ఆరోగ్యానికి, శారీరక, జ్ఞాపకశక్తి నెయ్యి మేలు చేస్తుంది. 

శీతాకాలంలో నెయ్యిని తీసుకోవడం వల్ల శరీరానికి వేడినిస్తుంది. అధిక వేడిని తట్టుకునే శక్తి నెయ్యికి ఉంది. కనుక వంటల్లో వాడుకోవచ్చు.

జీర్ణరసాల ప్రేరణకు నెయ్యి తోడ్పడుతుంది. అందుకే ఆహారంతో పాటు నెయ్యిని తీసుకోవడం వల్ల తిన్నది మంచిగా జీర్ణమవుతుంది. 

నెయ్యికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు ఉన్నాయి. కనుక దగ్గు, జలుబు తగ్గేందుకు సాయపడుతుంది.