సౌందర్య సోదరుడి చావుకు సంబంధించిన ఓ విషయాన్ని కూడా ఆమని చెప్పారు.అప్పుడు ఏం జరిగిందనేది ఆమని మాటల్లో..
సౌందర్య నేను ఎంతో క్లోజ్ గా ఉండేవాళ్ళం ఒకరి పర్సనల్స్ మరొకరు చెప్పుకునే వాళ్ళం..అన్నీ సక్రమంగా జరిగి ఉంటే సౌందర్య సోదరుడు అమర్ ని పెళ్లాడవలసి ఉండేది.
సౌందర్య తండ్రి సత్యనారాయణ స్వయంగా ఈ విషయం గురించి నన్ను అడిగారు.దానికి నా నుంచి పెద్దగా స్పందన లభించలేదు.
ఆ తర్వాత బెంగళూర్ లో కలిసినప్పుడు మా కుటుంబంలోని నాలుగు పిల్లర్స్ లో ఒక పిల్లర్ ని కోల్పోయామంటూ..
సౌందర్య వాళ్ళ నాన్న గురించి ఏడ్చింది.. ఆ తర్వాత సౌందర్య కూడా అమర్ ని పెళ్లి చేసుకుంటావా? అని అడిగేది.
2004 జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య ఆమె సోదరుడు కన్నుమూశారు. అది నేను టీవీలో చూసి తట్టుకోలేకపోయాను.
ఒక రకంగా చెప్పాలంటే నా మనసు కలత చెందింది. సౌందర్య మరణించిన నెల రోజులకు వెళ్లి వారి అమ్మగారితో గంటసేపు కూర్చొని, మాట్లాడి తిరిగి ఇంటికి వచ్చేసాను.
కానీ సౌందర్య ఫోటో కి దండ ఉండడాన్ని చూసి నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. సౌందర్యతో గడిపిన ఆ గత స్మృతులు ఇప్పటికీ గుర్తున్నాయని ఆమని చెప్పుకొచ్చారు.