తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అమలాపాల్‌ అంటే తెలియని వారుండరు.

దర్శకుడు ఏఎల్ విజయ్‌తో విడాకుల తర్వాత ఫ్రీ బర్డ్‌లా చెక్కర్లు కొడుతున్న ఈ భామ.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ సినిమాలో లిప్‌లాక్‌  నటించింది ఈ భామ.ఆ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ కూడా తాజాగా విడుదల అయింది.

ఈ లిప్‌లాక్‌పై విమర్శలు చెలరేగడంతో.. తాజాగా చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న అమలాపాల్.. వాటిపై స్పందించారు.

‘‘ఆడుజీవితం స్టోరీని వినిపించే సమయంలోనే లిప్‌లాక్‌ సన్నివేశం ఉంటుందని దర్శకుడు వివరించారు.

దానికి నేను ముందుగానే సమ్మతించాను. పైగా ఆ సన్నివేశం లిప్‌లాక్‌ చేస్తేనే పండుతుంది. అందుకే అలా నటించాను.

‘ఆడై’ అనే చిత్రంలో న్యూడ్‌గా నటించాను. నా వరకు కథ డిమాండ్‌ చేస్తే దుస్తులిప్పేసి నటించేందుకు కూడా ఎలాంటి బెరుకు లేదు.

గతంలోనే న్యూడ్‌గా నటించిన నాకు ఈ చిత్రంలో లిప్‌లాక్‌ సన్నివేశంలో నటించడం పెద్ద విషయంగా అనిపించలేదు’’ అని పేర్కొంది.