బాదం నూనె మీ చర్మానికి చాలా మేలు చేస్తుంది
విటమిన్-ఎ అధికంగా ఉండే బాదం నూనెను కళ్ల కింద అప్లై చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ సమస్యను దూరం చేసుకోవచ్చు.
బాదం నూనెలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది ముఖంపై మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.
చలికాలంలో తరచుగా చర్మం పొడిబారుతుంది కాబట్టి పడుకునే ముందు బాదం నూనెతో మర్దన చేయడం వల్ల చర్మం మెరుగుపడుతుంది
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు బాదం నూనెలో ఉంటాయి. ఇది చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. మృదువుగా చేస్తుంది.
గర్భధారణ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తాయి. వీటిని తొలిగించుకునేందుకు బాదం నూనెను మసాజ్ చేయడం వల్ల గుర్తులను వదిలించుకోవచ్చు