హీరో అల్లు అర్జున్‌ కొత్త మూవీ ఖరారైంది

సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో బన్నీ ఓ పాన్‌ ఇండియా సినిమాలో నటించనున్నారు

టీ-సిరీస్‌ బ్యానర్ పై భూషణ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు

ఈ విషయాన్ని శుక్రవారం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం

కాగా ప్రస్తుతం ఐకాన్ స్టార్ ‘పుష్ప2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు

ఇది పూర్తయ్యాక త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ మూవీలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది

దీని తర్వాతే ఈ కొత్త సినిమా మొదలు కానుందని సమాచారం

కాగా ప్రస్తుతం రణ్‌బీర్‌ కపూర్‌తో ‘యానిమల్‌’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న సందీప్‌ తర్వాత ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ చిత్రాన్ని పూర్తి చేయనున్నారు