టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకుంది.

అయితే గతంలో ఈయన నటించిన ఓ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు చికెన్ దూరంపెట్టారు

చికెన్ ముట్టకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తోంది.

ఇలా నాన్ వెజ్ తినకుండా అల్లు అర్జున్ నటించిన సినిమా ఏంటి అనే విషయాన్ని వస్తే అల్లు అర్జున్ నటించిన చిత్రం దువ్వాడ జగన్నాథం.

ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక బ్రాహ్మణుడి కుర్రాడి పాత్రలో నటించారు.

బ్రాహ్మణులు నాన్ వెజ్ తినరు కనుక ఈ పాత్రలో నటించిన అల్లు అర్జున్ కూడా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు చికెన్ తన దరికి రానివ్వలేదని తెలుస్తుంది.

బ్రాహ్మణులను గౌరవిస్తూ అలాంటి పాత్రలో నటిస్తున్నందుకు చికెన్ తినకుండా ఉన్నారని ఓ సందర్భంగా హరీష్ శంకర్ చేసిన కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.