ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం పుష్ప రాజ్ మయంగా మారిపోయింది. పుష్ప నేమ్‌ అండ్ సీన్స్‌ నెట్టింటిని రఫ్పాడిస్తున్నాయి.

రఫ్ఫాడించడమే కాదు.. పుష్ప పాట్ టూ ది రూల్ పై అంచనాలు పెంచుతున్నాయి. ఈ సినిమా కోసం అందర్నీ ఈగర్గా వెయిట్ చేసేలా చేస్తున్నాయి.

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈరోజు విడుదలైన పుష్ప 2 టీజర్ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. మాస్ అవతార్‏లో బన్నీ లుక్ చూసి అభిమానులు ఖుషి అయ్యారు.

ఆడియన్స్ అంచనాలకు మించి టీజర్ ఉండడంతో ఈ సినిమా కోసం మరింత ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.

ఇక ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న పుష్ప రాజ్‌ ఫోటో మాత్రం అందర్నీ ఒక్క నిమిషం ఆగేలా చేస్తోంది.

కళ్లర్పకుండా చూసేలా చేస్తుంది. ఎప్పుడూ చూడని బన్నీని చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.