ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు.
అర్జున్ అనే బన్నీ అభిమాని తండ్రి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు
ఈ విషయం తెలుసుకున్న బన్నీ చికిత్సకు అవసరమైనంత డబ్బును పంపించాడు
తన ఫేవరెట్ హీరో సాయం చేయడంతో అర్జున్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు
' నా కుటుంబానికి సాయం చేసినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను' అని ట్వీట్ చేశాడు ఫ్యాన్
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
బన్నీ చేసిన మంచి పనిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి