ఈ మధ్యకాలంలో అల్లు అర్హ తన తండ్రితో క్యూట్ క్యూట్ గా మాట్లాడుతూ అల్లరి చేస్తూ ఉండే వీడియోలను బన్నీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఆ వీడియోలో అల్లు అర్హ పలికే క్యూట్ మాటలు ఎంతోమందిని ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు.

ఈ మధ్యకాలంలోనే శకుంతలం సినిమాలో డబ్బింగ్ చెప్పే వీడియో కూడా బయటకు వచ్చింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటించబోతుందట.

ఆ పాప పాత్ర హైలెట్ గా ఉండబోతుందని సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి.

మరి ఇందులో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే.

ఉస్తాద్ భగత్ సింగ్ చాలా డిఫరెంట్ యాంగిల్ లో రాబోతోందని, ఇందులో పవర్ స్టార్ లెక్చరర్ గా కనిపిస్తారని మరొక సమాచారం.