‘నాంది’ తర్వాత నరేశ్ కథానాయకుడిగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉగ్రం’.
యాక్షన్ ఎంటర్‌టైనర్ ఉగ్రం సినిమా మే 5న థియేటర్స్ లో రిలీజయింది.
ఈ సినిమాలో అల్లరి నరేష్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించాడు.
బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైనప్పటికీ నరేశ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
అల్లరి నరేష్ ని ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ లో చూడలేదని, చాలా మాస్ అండ్ పవర్ ఫుల్ గా కనిపించారని అభినందించారు.
ఉగ్రం సినిమాలో అల్లరి నరేష్ ఉగ్ర రూపం చూపించాడని అంతా అన్నారు.
ఈసినిమా త్వరలో ఓటీటీ వేదికగా సినీ ప్రియులను అలరించనుంది.
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా జూన్ 2 నుంచి ఇది అందుబాటులో ఉండనుంది.
ఈ విషయాన్ని సదరు సంస్థ బుధవారం అధికారికంగా ప్రకటించింది.