విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఉగ్రం’
‘నాంది’ లాంటి విజయం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రమిది
ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు
అయితే ఏప్రిల్ 14న విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది
ఈ నేపథ్యంలోనే సోమవారం ఈ చిత్రం కొత్త విడుదల తేదీ ప్రకటించారు మూవీ మేకర్స్
ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సోషల్ మీడియాలో ఓ కొత్త పోస్టర్ పంచుకుంది చిత్రబృందం
ఈ చిత్రంలో నరేష్ పోలీస్‌గా కనిపించనున్నారు
నరేష్‌కు జోడిగా మిర్నా మీనన్ ఈ చిత్రంలో నటిస్తోంది