భారతదేశం సనాతన ధర్మంలో కొబ్బరికాయకు విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. హిందూమత ఆచార, వ్యవహారాల్లో కొబ్బరికాయ ఒక భాగం

దేవతా మూర్తులను కొబ్బరి కాయతో పూజించడం ద్వారా వారి ఆశీస్సులు పొందవచ్చునని విశ్వాసం

అందుకే భక్తులు దేవాలయాల్లో, ఇళ్లలోనూ దేవుళ్ల ముందు కొబ్బరికాయను కొడుతారు

 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొబ్బరియ వలన వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం

ఇల్లు, కుటుంబ సభ్యులపై చెడు దృష్టి పడటం వల్ల ఇంటిపై, ఇంట్లోని వ్యక్తుల జీవితంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది

దిని కారణంగా కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు, వివాదాలు తలెత్తుతాయి. కొన్నిసార్లు సంబంధాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది

ఈ ప్రతికూలతను తొలగించడానికి కొబ్బరికాయ ఉపకరిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు

కొబ్బరికాయను బాధిత వ్యక్తి మీద నుంచి 11 సార్లు తిప్పాలి. ఆ తరువాత కొబ్బరికాయను కాల్చి, దాని బూడిదను నీటిలో కలిపేయాలి