ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది హీరోయిన్ అలియాభట్
ఇదివరకు చేసినవే తప్ప మరో కొత్త సినిమాకు ఓకే చెప్పలేదు అలియా
కాగా ‘వార్ 2’ చిత్రం విషయంలో మాత్రం అలియా పేరు గట్టిగా వినిపిస్తోంది
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా ‘వార్ 2’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే
యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని రూపొందిస్తారని సమాచారం
ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు అలియా పేరు వినిపిస్తోంది
ఇదివరకు ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో ఎన్టీఆర్, అలియాభట్ కలిసి నటించిన విషయం తెలిసిందే
మరి ‘వార్ 2’లో అలియా నటిస్తే ఎవరి సరసన చేయనుందో చూడాలి