రామ్ చరణ్, ఉపాసన త్వరలో అమ్మానాన్నలు కాబోతున్నారని విషయం తెలిసిందే.
పెళ్ళి అయి ఏళ్లు గడుస్తున్నా వాళ్ళకు పిల్లలు లేకపోవడంతో అనేక రకమైన పుకార్లు ఎదురుకున్నారు.
కాగా 10 ఏళ్ళ తరువాత పేరెంట్ హుడ్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు శుభవార్త తెలియజేశారు.
ఇక ఈ వార్త విన్న మెగా ఫ్యామిలీ, మెగా అభిమాలు సంబరాలు చేసుకున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే ఉపాసనకు ఒక క్యూట్ గిఫ్ట్ పంపింది బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్.
అలియా భట్ Ed-a-Mamma అనే క్లాథింగ్ ప్లాట్‌ఫార్మ్ కి బ్రాండ్ అంబాసడర్ గా ఉంది.
Ed-a-Mamma ప్లాట్‌ఫార్మ్ లో ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ కిడ్స్ కి సంబంధించిన డ్రెస్సెస్ ఉంటాయి.
కాగా ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న ఉపాసనకు Ed-a-Mamma నుంచి బేబీకి సంబంధించిన డ్రెస్సెస్ గిఫ్ట్ గా పంపించింది అలియా.
ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అలియాకి థాంక్యూ చబుతూ తెలియజేసింది ఉపాసన.