ఆదివారం ఉదయం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పండింటి పాపకు జన్మనిచ్చారు.
భర్త రణబీర్ కపూర్‌తో ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరిన ఆలియా మధ్యాహ్నం సమయంలో ఆడపిల్లకు జన్మనిచ్చారు.
ప్రస్తుతం తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని కపూర్ కుటుంబసభ్యులు తెలిపారు.
రణబీర్తోపాటు సోనీ రజ్దాన్, నీతూ కపూర్ ఆసుపత్రిలో అలియాతో ఉన్నారు. పాప రాకతో కపూర కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది.
మరోవైపు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు ఆలియా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ విషయం అలియా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.
ఆలియా చివరగా బ్రహ్మాస్త్ర సినిమాలో కనిపించింది.