ఫిబ్రవరి 18న నందమూరి తారకరత్న మరణంతో యావత్ సినీ లోకంలో విషాదం అలుముకుంది. మంచి భవిష్యత్ ఉన్న ఆయన మృతి చెందడం ఏ ఒక్కరు జీర్ణించుకోలేక పోతున్నారు.
నందమూరి కుటుంబ అయితే ఒక్కసారిగా కుంగిపోయింది. ఈ నేపథ్యంలో తారకరత్న లవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తారకరత్న రాసిన ఈ లవ్ లెటర్ ని తన సోషల్ మీడియా ఖాతాలో స్వయంగా పోస్ట్ చేస్తూ ఎమోషనల్ మెసేజ్ రాసింది అలేఖ్య రెడ్డి.
తారకరత్న పెద్ద కర్మ రోజున తన భర్త జ్ఞాపకాలతో తీవ్ర భావోద్వేగం చెందిది అలేఖ్య రెడ్డి.
తన భర్తతో గడిపిన ఆ క్షణాలను మరచిపోలేక పోతోంది అలేఖ్య రెడ్డి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎంత ఓదార్చినా కూడా కంటతడి పెట్టుకోవడం ఆపడం లేదట.
ఈ నేపథ్యంలో తన భర్త తారకరత్న రాసిన లవ్ లెటర్ పంచుకుంటూ ఎమోషనల్ అయింది.