హీరోయిన్ కాకపోయినా సోషల్ మీడియాలో దేత్తడి హారికకు యమ డిమాండ్.

తన తీరుతో హాట్ లేడీగా యూత్ గుండెల్లో చోటు సంపాదించింది అలేఖ్య (దేత్తడి హారిక).

ఆన్ లైన్ మాధ్యమాలపై తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పరచుకొని రచ్చ చేస్తోంది.

ఇక సోషల్‌ మీడియాలో ఆమె పోస్ట్‌ చేసే ఫోటోషూట్స్‌, రీల్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తాజాగా ఆమె 'ఒక కొంటెపిల్లనే చూశా.. సెంటిమీటర్‌ నవ్వమని అడిగా.. తను నవ్వే నవ్వితే వంద మంది సచ్చిపోయారే..' పాటకు రీల్‌ చేసింది.

 నీలిరంగు చీరలో చిరునవ్వు విసురుతూ కవ్వించింది దేత్తడిపాప.

 ఇది చూసిన ఓ నెటిజన్‌ వందమంది చనిపోయారంటే నువ్వు సరిగా బ్రష్‌ చేసుకోలేదేమో అని సెటైర్‌ వేశాడు.

దీనికి హారిక స్పందిస్తూ.. అబ్బే ఏం పేలలేదు అని కౌంటరిచ్చింది.

చాలామంది ఇలాగే వెటకారంగా కామెంట్లు చేస్తుండేసరికి ఏకంగా కామెంట్‌ సెక్షన్‌నే ఆఫ్‌ చేసుకుంది హారిక.