టాలీవుడ్ హీరోలు తమ సినిమాలతో ఆడియెన్స్ ను ఆకట్టుకునేందుకు లుక్స్ విషయంలో ప్రయోగాలు చేస్తుంటారు.
అలా గత కొద్ది కాలంగా.. మాసీ లుక్ కోసం రింగులు తిరిగిన జుట్టుతో ఎక్కువగా కనిపిస్తున్నారు.
ఇక ఇదే తరహాలో అక్కినియి నాగచైతన్య కూడా తన హెయిర్ స్టైల్ మార్చేశారు..
ఇండస్ట్రీలో అక్కినేని హీరోలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా వీరికి అమ్మాయిలు… ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది.
ఇప్పటివరకు లవర్ బాయ్స్ లా ప్రేమకథా చిత్రాలతో అలరించిన అక్కినేని హీరో ఇప్పుడు వెరీ సీరియస్ ఫిల్మ్ తో మన ముందుకు వస్తున్నారు.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులతో పాటు.. తమిళ్ ప్రేక్షకులను కూడా తన కస్టడీకి తీసుకునే ప్రయత్నాన్ని మొదలెట్టారు.
కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే చైతు తన న్యూ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్నారు.
ఇప్పుడు ఈ లుక్ పై సోషల్ మీడియాలో పలు కామెంట్స్ తో సొంతం చేసుకుంటున్నారు చైతు..