అక్కినేని అఖిల్, సాక్షి వైద్యం జంటగా నటించిన చిత్రం ఏజెంట్.
ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది.
ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు.
తాజాగా ఈ చిత్రం రిజల్ట్‌పై అఖిల్ స్పందించారు. తన ఫ్యాన్స్, ఏజెంట్ మూవీ నటీనటులను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు.
ఏజెంట్ సినిమాకి ప్రాణం పోయడం కోసం తమ జీవితాలను అంకితం చేసిన నటీనటులు, సిబ్బందికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు.
మేము మా స్థాయిలో ఉత్తమంగా ప్రయత్నించాం. కానీ దురదృష్టవశాత్తూ ఈ చిత్రం తెరపై మేము కోరుకున్న విధంగా మెప్పించలేదు.
మేము మీ కోసం మంచి చిత్రాన్ని అందించలేకపోయాము. నాకు పెద్ద సపోర్ట్‌గా నిలిచిన నిర్మాత అనిల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
మా సినిమాపై నమ్మకం ఉంచిన డిస్ట్రిబ్యూటర్లందరికీ.. మాకు ఎంతో సపోర్ట్ చేసిన మీడియాకు ధన్యవాదాలు.
నేను పని చేయడానికి కారణం మీరిచ్చే ప్రేమ, శక్తి . నన్ను నమ్మిన వారి కోసం బలంగా తిరిగి వస్తా.. అంటూ నోట్ విడుదల చేశారు.