అక్కినేని ప్రిన్స్‌ అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా స్పై థ్రిల్లర్ మూవీ ఏజెంట్‌(Agent).

ఇప్పటికే చాలా డిలే అయిన ఈ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేస్తాం అంటూ ఆల్రెడీ ప్రకటించారు మేకర్స్.

డేట్ అయితే ఇచ్చారు గానీ  ప్రమోషన్ విషయంలో మాత్రం ఆ రేంజ్‌ చూపించటం లేదు.

దీంతో ఈ మూవీ ఆడియన్స్‌ ముందుకు ఎప్పుడొస్తుందన్న కన్‌ఫ్యూజన్‌ క్రియేట్ అవుతోంది.

ఆల్రెడీ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం కన్‌ఫ్యూజన్‌ కంటిన్యూ అవుతోంది.

కోవిడ్ బ్రేక్ పడకపోయుంటే ఏజెంట్ ఎప్పుడో ఆడియన్స్ ముందుకు వచ్చుండేది.

కానీ కరోనా కారణంగా డిలే కావటంతో రిలీజ్ ఆలస్యమైంది

ఆ మధ్య ఆగస్టు 12న రిలీజ్ అంటూ అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చింది టీమ్‌.