అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రానుంది.

అఖిల్ ఈ సినిమాలో ఏజెంట్ గా కనిపించనున్నాడు . మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

టీజర్‌ను చూస్తుంటే సరికొత్త స్పై థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. యాక్షన్‌ సీక్వెన్సులు హాలీవుడ్‌ రేంజ్‌లో ఉన్నాయి.

ఇక అఖిల్‌ ఆహార్యం, చెప్పిన డైలాగులు అభిమానుల్లో జోష్‌ నింపేలా ఉన్నాయి. ఈ సినిమాకు కోలీవుడ్‌ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ హిప్‌హాప్‌ తమీజా స్వరాలు సమకూరుస్తున్నారు

అయితే ఉన్నట్టుండి ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

”ఏజెంట్” కూడా బరిలో దిగుతున్నట్లు అనౌన్స్ చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

ప్రభాస్ – మెగాస్టార్ చిరంజీవి – నటసింహం బాలయ్యలాంటి బడా హీరోల సినిమాల మధ్యలో అక్కినేని కుర్ర హీరో ఆడేలా ఉంది.