త‌మిళ స్టార్ హీరో అజిత్ రూటే స‌ప‌రేటు..ఆయనకు నటన వృత్తి. బైక్‌ రేస్, రైఫిల్‌ షూటింగ్‌ ప్రవృత్తి.

అగ్ర కథానాయకుడిగా రాణిస్తునే మరోపక్క మనసుకు నచ్చిన పలు క్రీడాంశాల్లో పాల్గొంటున్నారు.

మొన్నీమధ్య రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో పాల్గొని బహుమతులను గెలుచుకున్నారు.

కాగా సినిమా కంటే ముందు తాను గేమ్స్ ను ఎక్కువ ఇష్ట పడతానని చాలా సందర్భాల్లో చెప్పారు త‌మిళ స్టార్ హీరో అజిత్.

అయితే హీరో అజిత్ అతని భార్య శాలినికి విడాకులు ఇస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది.

అయితే ఈ వార్తలన్నిటికీ చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు హీరో అజిత్.

తన భార్యతో వెకేషన్ కు వెళ్లిన హీరో అజిత్ రొమాంటిక్ ఫోటోలు షేర్ చేశారు.

 ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ కావడంతో విడాకుల వార్తలకు చెక్ పడినట్లు అయింది.