విజయ్ తండ్రిగా సంజయ్‌దత్‌..

లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం  ‘లియో’.

ఈ చిత్రంలో విజయ్‌కి జోడిగా త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో సంజయ్‌దత్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ నెల 22న విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘నా రెడీ..’ అనే సాంగ్ విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్.

ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

దీంతో ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం బయటపడింది.

తాజాగా విడుదలైన పోస్టర్‌లో విజయ్‌, సంజయ్‌దత్‌లు ఒకేలాంటి చైన్‌లు ధరించి ఉన్నారు.

దీంతో వీరిద్దరూ తండ్రీకొడుకులు లేదా అన్నాదమ్ములుగా కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ చిత్రం అక్టోబర్ 19న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.