హోస్ట్‌ కపిల్‌ శర్మ నాటు నాటు ఆస్కార్‌ గెలవడంతో అజయ్‌ కి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మీరు నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి ఆస్కార్‌ రావడం ఎలా అనిపించిందని కపిల్‌ శర్మ ప్రశ్నించాడు.

దీనికి అజయ్‌ దేవగన్‌ స్పందిస్తూ నిజానికి నాటు నాటుకు ఆస్కార్‌ నా వల్లే వచ్చిందంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

అదేలా.? అని హోస్ట్‌ అడగ్గా.. 'అదే నేను నాటు నాటుకు డాన్స్‌ చేసి ఉంటే ఎలా ఉండేది.

నా డాన్స్‌ చూసి అకాడెమీ జ్యూరీ మెంబర్స్‌ ఆస్కార్‌ ఇచ్చేవారే కాదు' అంటూ చమత్కిరించాడు.

అజయ్‌ సమాధానం విని అంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు.

దీంతో అజయ్‌ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

దీనిపై నెటిజన్లు రకరకాలు గా స్పందిస్తున్నారు.