ఓ సినిమాను నేనెప్పుడూ దక్షిణాది, ఉత్తరాది అని విభజించి చూడలేదు.

ఏ సినిమా అయినా అది భారతీయ సినిమాగానే భావిస్తాను

ఉత్తరాదిపై దక్షిణాది చిత్ర పరిశ్రమ ఆధిపత్యం చలాయిస్తుందనీ కొందరు అనుకుంటున్నారు.

ఏ రంగంలో అయినా పోటీ ఉన్నట్లే చిత్ర పరిశ్రమలోనూ ఒక ఇండస్ట్రీకి మరొక ఇండస్ట్రీకి మధ్య పోటీ ఉంటుంది.

అయితే కళాకారుల మధ్య అలాంటి భేదాలుండవు.

ఒకదానిపై మరొకటి ఆధిపత్యం చలాయిస్తుందనే అభిప్రాయాన్ని అంగీకరించను.

ఒకచోట అవకాశాలు రాకపోతే మరొక చోట ప్రయత్నించవచ్చు. అక్కడ కూడా రాకపోతే వేరే ఇండస్ట్రీలోకి వెళ్లొచ్చు.

కళకు, కళాకారులకు ఎక్కడైనా గౌరవం ఉంటుంది. పని చేసే ప్రతి సినిమా నుంచి ఏదో ఒక విషయం నేర్చుకోవచ్చు.