అమ్ము, పొన్నియన్ సెల్వన్, మట్టి కుస్తీ వంటి చిత్రాలతో మెప్పించిన మలయాళ భామ ఐశ్వర్య లక్ష్మి
తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో నటుడు అర్జున్ దాస్‌తో ప్రేమలో పడినట్లు చెపుతూ అర్జున్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది
ఇది చూసిన ఫ్యాన్స్ కొందరు కంగ్రాట్స్ చెప్తుంటే మరికొందరు మాత్రం ఇది ప్రమోషన్ స్టంట్ అయ్యుండొచ్చు అంటున్నారు
త్వరలో ఏదైనా కొత్త మూవీలో కలిసి నటిస్తున్నారేమో అని కొందరు కామెంట్లు పెడుతున్నారు
కాగా అర్జున్ దాస్ మాస్టర్ మూవీలో ఓ కీలక పాత్రలో కనిపించడు
బుట్టబొమ్మ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు అర్జున్ దాస్
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ప్రేమ పెళ్లి ఇష్టమా? పెద్దలు కుదిర్చిన వివాహం ఇష్టమా? అన్న ప్రశ్నకు అసలు పెళ్లంటేనే ఇష్టం లేదని ఐశ్వర్య లక్ష్మి వెల్లడించింది
అలా చెప్పిన నెలలోనే ప్రియుడిని పరిచయం చేస్తూ ఇంస్టాలో పోస్ట్ చేయడంపై ఫ్యాన్స్ ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు