డిజిటల్ రంగంలో 100 శాతం ఎంటర్టైన్మెంట్ అందిస్తూ దూసుకుపోతుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా

చిత్రాలు , వెబ్ సిరీస్ ,  రియాలిటీషోలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ తో మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.

ఈ మేరకు ఔత్సాహిక నటీనటులకు ఆడిషన్స్‌ నిర్వహించబోతుంది. 

26-34 ఏళ్ల యువకులను సినిమాలోని పాత్రలకు తగ్గట్టు కేటగిరీలుగా విభజించి ఆడిషన్స్‌ నిర్వహించనున్నారు.

ఆసక్తి ఉన్నవారు ఆడిషన్స్‌ కోసం 2 నిమిషాల ఓ వీడియో క్లిప్‌ రూపొందించి.. ఈనెల 24లోపు తమకు మెయిల్‌ పంపించాలని ఆహా, మైత్రి నిర్మాణ సంస్థలు ఈ ప్రకటనలో పేర్కొన్నాయి.

తెలంగాణ వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు, ఆసక్తిగల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.