నాగశౌర్య, మాళవిక నాయర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’

శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్‌, పద్మజ దాసరి సంయుక్తంగా నిర్మించారు

ఈనెల 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది .ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది

ఈ కార్యక్రమానికి అడివి శేష్‌, అశ్వినీదత్‌, బాబీ, మారుతి, నందినిరెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు

ఈ ఈవెంట్ లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం విడుదలయ్యాక మమ్మల్ని అందరూ ఫలానా శౌర్య, ఫలానా శ్రీనివాస్‌, ఫలానా మాళవిక అంటారు

నాలుగేళ్లు ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. ఆరోగ్యం సహకరించకపోయినా శ్రీనివాస్‌ ఎప్పుడూ స్క్రిప్ట్‌పై పని చేస్తూనే ఉన్నారు.

ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టేస్తుందని చెప్పను కానీ.. అందరి మదిలో కూర్చుండిపోతాం’’ అని తెలిపారు

‘‘దీనికి ఎమోషన్‌ పండించగల నటి కావాలి. ఈ కథ చెప్పినప్పుడు మాళవిక స్పందన చూసి పూర్తి నమ్మకం వచ్చేసింది.

దర్శకుడిగా నాకు మంచి పేరు వచ్చిందంటే దానికి ప్రధాన కారణం నాగశౌర్య. అతని నటన కోసం ఉత్సాహంగా సెట్‌కు వెళ్లిన సందర్భాలున్నాయి’’ అన్నారు శ్రీనివాస్‌ అవసరాల