చల్లటి నీటితో స్నానం అనే ఆలోచన వస్తేనే జంకుతాం. కానీ, కొంచెం ధైర్యం చేసి చన్నీటితో స్నానం చేశామంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు

మొదట్లో వేడి నీటితో స్నానం చేసినా.. చివర్లో కేవలం 30 సెకన్ల పాటు చన్నీటిని నెత్తిపై పోవడం ద్వారా ఈ ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు

మెదడులో కార్యకలాపాలను ఉత్తేజ పరుస్తుంది. దాంతో డిప్రెషన్ నుంచి కోలుకోవచ్చని ప్రముఖ వైద్యులు మిచెల్ గ్రీన్ తెలిపారు

చల్లటి నీటితో స్నానం చేయడం ద్వారా శరీరానికి చిన్నపాటి షాక్‌ తగిలినట్లుగా అనిపిస్తుంది. ఆ అనుభూతి నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది

చన్నీటితో స్నానం చేయడం ద్వారా.. జుట్టు మెరుస్తుంది. పెరుగుదల కూడా కనిపిస్తుంది

చన్నీటితో స్నానం చేయడం ద్వారా చర్మం పొడిబారకుండా ఉంటంది, ముఖం మెరుస్తున్నట్లుగా ఉంటుంది

తీవ్రమైన వ్యాయామం చేసిన తరువాత కండరాలు అలసిపోయినట్లుగా ఉంటాయి

అలాంటి పరిస్థితి నుంచి ఉపశమనం పొందాలంటే చల్లని నీటితో స్నానం చేయడం ఉపకరిస్తుంది. చన్నీటితో స్నానం చేయడం ద్వారా అలసట తగ్గుతుందని పలు అధ్యయనాల్లో పేర్కొంది