‘పంజా’ చిత్రంలో నెగిటివ్‌ షేడ్స్‌లో ఉన్న పాత్రలో నటించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు యంగ్‌ హీరో అడవి శేష్‌.

ఇక 2018లో వచ్చిన ‘గూడఛారి’ సినిమాతో హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు.

తనదైన నటనతో ప్రేక్షకులకు అట్రాక్ట్‌ చేశాడు.

తాజాగా మేజర్‌ చిత్రంతో పాన్‌ ఇండియాగా మారాడు. ఇక ప్రస్తుతం హిట్‌ సీక్వెల్ చిత్రంలో నటిస్తున్నాడు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శేష్‌ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

మీరు అందంగా ఉండడానికి గల కారణం ఏంటన్న ప్రశ్నకు స్పందిస్తూ..

‘నేను మందు, పొగ, డ్రగ్స్, నాన్ వెజ్‌కు దూరంగా ఉంటా. సమయానికి నిద్రపోతాను. అని చెప్పుకొచ్చాడు.