అదితీరావు హైదరీ.. తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. మిగిలిన భాషల్లో కూడా సినిమాలతో దూసుకుపోతోంది.
కానీ, సరైన హిట్లు అందుకుని చాలా రోజులు అవుతోంది. ఈమె తాజాగా జీ5 ఒరిజినల్స్ తాజ్ డివైడెడ్ బై బ్లడ్ అనే వెబ్ సిరీస్ లో అనార్కలీగా సందడి చేసింది.
ఆమె సినిమాలకు సంబంధించిన విషయాల కంటే ఆమె వ్యక్తిగత జీవితం గురించే ఈ మధ్య ఎక్కువగా చర్చ జరుగుతోంది.
ఎందుకంటే ఆమె ఓ హీరోతో రిలేషన్ లో ఉందని, వాళ్లు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చాలానే వార్తలు వచ్చాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితీని సిద్ధార్థ్ తో పెళ్లి గురించి ప్రశ్నించారు.
అందుకు ఆమె “నేను ఎవరితో రిలేషన్ లో ఉన్నాను? నేను ఎవరిని పెళ్లి చేసుకుంటాను? అనే విషయాల గురించి కాకుండా మనం సినిమాల గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది.
నేను సినిమాలు చేసేందుకు చాలా కష్టపడుతున్నాను. కాబట్టి నా సినిమాలకు సంబంధించి మీరు ప్రశ్నిస్తే బావుంటుంది” అంటూ అదితీరావు సమాధానం చెప్పింది.
ఆమె ఆన్సర్ చూసిన నెటిజనులు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. అంటే మీరు నిజంగానే లవ్ లో లేరా? డేటింగ్ పేరుతో టైమ్ పాస్ చేస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.