ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్‌’.

ఈ చిత్రంలో సీత పాత్రలో కృతి సనాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌ రావణుడి పాత్రలో కనిపించనున్నారు.

సన్నీసింగ్‌ ఈ చిత్రంలో లక్ష్మణుడి పాత్ర పోషించారు.

రామాయణం ఆధారంగా చెడుపై గెలిచిన మంచిని ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

కాగా  ఈనెల 9న ఈ  చిత్ర ట్రైలర్‌ విడుదల కానున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటె ట్రైలర్‌ను ప్రపంచవ్యాప్తంగా  దాదాపు 70 దేశాల్లో థియేటర్లలో భారీ స్థాయిలో  విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ చిత్రం జూన్‌ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.