పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’.

భారతీయుల ఇతిహాస గ్రంథం రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16న విడుదల కాబోతోంది

రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్లను కూడా వేగవంతం చేశారు మేకర్స్.

ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. తిరుపతిలో అభిమానుల సమక్షంలో ఆ వేడుక ఘనంగా జరిగింది.

అలాగే రిలీజ్ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. అన్నిటికీ మంచి స్పందన లభించింది.

తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.

ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా ‘యు’ రేటింగ్ ను జారీ చేసింది సెన్సార్ బృందం.

మైథలాజికల్ మూవీ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని హ్యాపీగా వీక్షించొచ్చు.

 కాకపోతే.. ఒక్క విషయంలో ‘ఆదిపురుష్’ టెన్షన్ పెడుతుంది. అదే రన్ టైం విషయంలో.

ఈ చిత్రం రన్ టైం ఏకంగా 179 నిముషాలు. అంటే 2 గంటల 59 నిమిషాల నిడివి అన్నమాట.