ఎవరిని కదిపినా సరే 'ఆదిపురుష్' సినిమా గురించే మాట్లాడుతున్నారు.

ఆల్రెడీ థియేటర్లలోకి వచ్చేసిన ఈ మూవీ..  పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకుల్ని అద్భుతంగా ఎంటర్‌టైన్ చేస‍్తోంది.

టీజర్ ని గతేడాది రిలీజ్ చేసిన టైంలో ఈ మూవీపై ఘోరమైన ట్రోల్స్ వచ‍్చాయి.

దీంతో థియేటర్లలోకి వచ్చి ఈ సినిమాని ఎవరైనా చూస్తారా అని అందరూ అనుకున్నారు.

తొలిరోజు షోలన్నీ ఇప్పటికే హౌస్ ఫుల్స్ అయిపోయాయి.

ఇలాంటి టైంలో ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టించినట్లు తెలుస్తోంది.

'ఆదిపురుష్'పై ఇష్టాన్ని చాలామంది సోషల్ మీడియాలో చూపిస్తే.. మరికొందరు టికెట్స్ అమ్మే బుక్ మై షోలో లైక్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

అలా ఇప్పటివరకు 1.1 మిలియన్ యూజర్స్.. ఈ టికెట్ బుకింగ్ సైట్ లో 'ఆదిపురుష్'కి లైక్ కొట్టారు.

దీంతో 1 మిలియన్ మార్క్ అందుకున్న మూవీగా ఇది ఘనత సాధించింది.

ఈ లిస్టులో 'ఆర్ఆర్ఆర్'.. 1.75 మిలియన్ లైక్స్ తో టాప్ లో ఉంది.