ఆదిపురుష్‌` సినిమాపై క్రమంగా బజ్‌ అమాంతం పెరుగుతుంది.

`ఆదిపురుష్‌` ట్రైలర్‌తో టీజర్‌కు వచ్చిన విమర్శలకు చెక్‌ పెట్టింది యూనిట్‌. 

అంతేకాదు మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీని తీసేసి రియాలిటీకి ప్రయారిటీ ఇచ్చారు. దీంతో ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు. 

దీనికితోడు సీత ఎమోషన్స్, రామాయణం(హిందుత్వం) సెంటిమెంట్‌ ఈ సినిమాకి కలిసొస్తున్నాయి. 

ఈ అంచనాలను మరింత పెంచేందుకు ఓ క్రేజీ ప్లాన్‌ రెడీ చేసింది యూనిట్‌. 

`ఆదిపురుష్‌ ` నుంచి మరో భారీ సర్‌ప్రైజ్‌ చేసింది. సినిమా నుంచి మరో ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు. 

`ఆదిపురుష్‌` 2.0 పేరుతో మరో ట్రైలర్‌ని వదలబోతున్నారు. ఈ వార్త ఇప్పుడు నెట్టింట ట్రెండ్‌ అవుతుంది. 

అయితే మొదటి ట్రైలర్‌లో ఎమోషన్స్ ని చూపించారు. యుద్ధానికి సన్నద్దం కావడాన్ని చూపించారు. 

పూర్తి స్థాయిలో యుద్ధ అంశాల నేపథ్యంలో ఈ ట్రైలర్ ని కట్‌ చేశారు అని తెలుస్తుంది.

ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో ఈ ట్రైలర్ ని విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఇది ప్రభాస్‌ ఫ్యాన్స్ కి బిగ్‌ సర్‌ప్రైజ్‌గా ఉండబోతుండటం విశేషం.