పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిసిందే

మంచి బ్యాక్టీరియాను పెంచడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడే పెరుగును తీసుకోవడం చాలా మంచిది

పెరుగులో కొందరు పంచదార కలిపి తింటే, ఉప్పు, కారం కలిపి మరికొందరు తింటుంటారు

పెరుగులో తేనె కలిపి తింటే మాత్రం, దాని నుంచి ఎక్కువ ప్రయోజనాలను పొందే ఛాన్స్ ఉంది

తేనెలో అధిక మొత్తంలో గ్లూకోజ్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెరుగులో తేనె కలిపి తింటే ఎంతో మేలు జరుగుతుంది

తేనె, పెరుగు రెండూ ప్రోబయోటిక్స్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఇవి ప్రాథమికంగా బ్యాక్టీరియా, ఈస్ట్‌‌ను కలిగి ఉన్నాయి. ఇవి జీర్ణక్రియలో సహాయపడతాయి

ఎముకల నొప్పులు ఉన్నవారు పెరుగు, తేనె తినడం వల్ల ప్రయోజనం పొందవచ్చు

విటమిన్ సి పెరుగు, తేనెలో లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది