మహిళలు తమ శిరోజాల సంరక్షణ కోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.
అయితే కొన్ని రకాల షాంపుల్లో కెమిక్లస్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది.
మీరు తలకు షాంపూ పెట్టినప్పుడు... ఈ చిన్న పాటి టిప్స్ పాటిస్తే.. మీ జుట్టు రాలకుండా ఉంటుంది.
షాంపూ లో నీటిని కలిపి దానిలో ఉసిరికాయ రసాన్ని కలిపి తలకు అప్లై చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.
ఉసిరి కాయ రసం తో పాటు బృంగరాజ్ఆకు రసాన్ని షాంపూలో కలిపి అప్లై చేస్తే అన్ని రకాల సమస్యలు తగ్గటమే కాకుండా తెల్ల జుట్టు సమస్య కూడా తొలగిపోతుంది.
చుండ్రు సమస్య అధికంగా ఉన్నవారు షాంపూలో వేపాకుల రసాన్ని కలిపి తలకు అప్లై చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.
తలస్నానం చేసే ముందు కొద్దిగా గోరువెచ్చని నీటితో తలను తడిపితే తలలోని చర్మ కణాలు ఓపెన్ అయ్యి అప్లై చేసిన పదార్థాలు కణాలలోకి వెళ్ళి ఆరోగ్యంగా బలంగా పెరగటానికి సహాయపడుతుంది.