మంచి జీవనశైలితోపాటు.. ఆరోగ్యం కోసం ఆహారంలో కొన్నింటిని తప్పనిసరిగా చేర్చుకోవాలి.
కొన్ని ఆహారాలు రోజంతా మిమ్మల్ని ఎనర్జిటిక్‌గా ఉంచడంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి.
పెరుగులో మంచి బ్యాక్టీరియా, ప్రోటీన్, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది.
తేలికగా, ఆరోగ్యంగా ఏదైనా తినాలనుకుంటే స్టీల్ కట్ ఓట్స్‌ని తినవచ్చు.
ఆహారంలో సహజ చక్కెర ఉన్న అరటిని చేర్చుకుంటే మంచిది.
డ్రై ఫ్రూట్స్, తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకుంటే మంచిది.
విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న క్వినోవా, మొలకలను రెగ్యులర్‌గా తినండి..
ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడంతోపాటు.. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.