ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమయ్యే సినిమాలు, సిరీస్‌లకు సెన్సార్ తప్పనిసరి చేయాలని ప్రముఖ నటి విజయశాంతి పేర్కొన్నారు
ఆ అంశాన్ని ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళలు సంబంధిత బోర్డు ముందుకు తీసుకొచ్చారని ఆమె అన్నారు
‘‘ఈ మధ్యనే విడుదలైన ఓ తెలుగు (బహుభాషా) ఓటీటీ సిరీస్‌పై..’’ అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు విజయశాంతి
ఓటీటీలో ప్రసారమయ్యే అసభ్యకరమైన దృశ్యాలను తొలగించి, ప్రజా వ్యతిరేకతకు గురికాకుండా చూసుకోవాలని సంబంధిత నటులు, నిర్మాతలకు సూచించారు విజయశాంతి
‘‘తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల వరకు తెచ్చుకోకుండా ఉంటారని భావిస్తున్నా
ప్రేక్షకులు చూపించే అభిమానాన్ని కాపాడుకుంటారని అభిప్రాయపడుతున్నా’’ అని ఆమె తెలిపారు
ఈ పోస్ట్‌పై స్పందించిన పలువురు నెటిజన్లు ‘మీరు చెప్పింది 100 శాతం నిజం’, ‘అవును.. ఓటీటీకి సెన్సార్ ఉండాలి’
‘మంచి పేరున్నా నటులూ ఓటీటీలో అసభ్యకరమైన సంభాషణలు చెబుతుంటే చిరాకు వస్తుంది’ అని కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు