టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో అందాలభామ వర్ష ఒకరు.

హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు ఈ ముద్దుగుమ్మ.

తమిళ, మలయాళ సినిమాలతో పాపులర్ అయిన వర్ష బొల్లమ్మకు తెలుగులో మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో సక్సెస్ దక్కింది.

స్వాతి ముత్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకు ముందు స్టాండ్ అప్ రాహుల్ సినిమాతో ఫ్లాప్ అందుకుంది.

 తాజాగా ఈ బ్యూటీ మాట్లాడుతూ.. నాకు ఇలా సహజత్వానికి దగ్గరగా ఉండే కథలు అంటే ఇష్టం.

ఈ కథలో కొత్తదనం ఉంది. పాత్రలలో చాలా లోతు ఉంది. కథా కథనాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇక నేను ఒక చిన్న టౌన్ నుండి వచ్చాను.

ఈ అమ్మాయి ఇలాంటి పాత్ర కూడా చేస్తుందా అని అనుకునే లాంటి పాత్ర చేయాలని ఉంది.

ప్రతినాయిక ఛాయలు ఉన్న సైకో పాత్ర దొరికితే బాగా చేయగలనని నాకు నమ్మకం ఉంది అని చెప్పుకొచ్చింది