మిల్కీ బ్యూటీ తమన్నా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది

తాజాగా నందమూరి బాలయ్య, దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబోలో తెరకెక్కుతునన్న మువీలో ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం తమన్నాను సంప్రదించినట్లు టాక్‌

ఐతే ఒక్క సాంగ్‌కు ఆమె ఏకంగా రూ.కోటిన్నర డిమాండ్‌ చేసినట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది

ఆ వార్తలపై తమన్నా స్పందిస్తూ..దర్శకుడు అనిల్‌ రావిపూడితో వర్క్‌ని నేను ఎప్పుడూ ఎంజాయ్‌ చేస్తాను

అనిల్‌ రావిపూడి, బాలకృష్ణపై నాకెంతో గౌరవం ఉంది. ఐతే వాళ్ల సినిమాలో నేను స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్నానంటూ వస్తోన్న వార్తలు నిరాధారమైనవి

ఆ వార్తలను చూసి నేను చాలా బాధపడ్డాను. ఇలాంటి ఆరోపణలు చేసేముందు దయచేసి ఓసారి రీసెర్చ్‌ చేసి తెలుసుకోండంటూ ట్వీట్‌ చేసింది

ఈ మేరకు బాలయ్య సినిమాలో తమన్నా స్పెషల్‌ సాంగ్‌పై వస్తున్న రూమర్లకు పుల్‌స్టాప్‌ పెట్టేసింది

కాగా బాలయ్య 108వ చిత్రం యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్రీకరణకు సన్నాహాలు చేస్తున్నారు

మహేశ్‌బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’లో తమన్నా స్పెషల్ సాంగ్‌లో కనిపించిన సంగతి తెలిసిందే